నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు కిష్టారెడ్డి జయంతి, గాంధీ జయంతి సందర్భంగా బుధవారం నారాయణఖేడ్ పట్టణంలోని లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. నారాయణఖేడ్ శాసనసభ్యులు సంజీవరెడ్డి మాట్లాడుతూ రక్తదానం అనేది ప్రాణదానం లాంటిదని కొనియాడారు. ఈ క్యాంపు కార్యక్రమంలో నారాయణ జాదవ్ రక్తదానం చేయడం జరిగింది.