నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ లుగా విధులు నిర్వహిస్తున్న, మక్సుద్ ఖాన్, రాజ్ కుమార్, రూప్ సింగ్, అమృత్, డబ్ల్యూ పిసి ప్రవీణలకు శుక్రవారం హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి లభించింది. నారాయణఖేడ్ సిఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్సై విద్య చరణ్ రెడ్డి, పోలీస్ సిబ్బంది వారిని అభినందించారు.