నారాయణఖేడ్ మండల పరిధిలోని ర్యాకల్ గ్రామంలో ఆదివారం శివ స్వాముల ఆధ్వర్యంలో మహా పడిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గం స్వాములు మరియు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో శివ స్వాములు తరలివచ్చారు. శివ నామస్మరణతో భజనలు, కీర్తనలు పాడారు. అనంతరం 108 జ్యోతులు వెలిగించి వివిధ పూజా కార్య క్రమాలు నిర్వహించారు.