జిన్నారం మండలం మాదారం గ్రామ పంచాయతీ పరిధిలోని కంకర క్రషర్ వాహనాలతో ఆర్ అండ్ బి రోడ్డు పూర్తిగా గుంతలు ఏర్పడడంతో మాదారం గ్రామస్తులతో పాటు జానకంపేట, వడక్ పల్లి గ్రామస్తులు శనివారం ఆందోళనకు దిగారు. భారీ లోడుతో తిరుగుతున్న టిప్పర్ లను అడ్డుకున్నారు. కంకర క్రషర్ నుంచి ఆర్ అండ్ బి రోడ్డుకు వాహనాలు రాకుండా రోడ్డును తవ్వారు. ఆర్టీవో అధికారికి ఫిర్యాదు చేయడంతో అధిక లోడుతో వెళ్తున్న వాహనాలను సీజ్ చేశారు.