కంకర క్రషన్ మిషన్లను ఆపి వేయించాలని కోరుతూ జిన్నారం తహసిల్దార్ కార్యాలయం ముందు నల్తూరు గ్రామస్తులు సోమవారం ధర్నా నిర్వహించారు. అధికారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కంకర క్రషన్ మిషన్లు ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకుంటామని తహసిల్దార్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం తహసిల్దార్, సిఐలకు వినతి పత్రాలను సమర్పించారు.