పోతిరెడ్డిపల్లిలో అంబేద్కర్ జయంతి

275చూసినవారు
పోతిరెడ్డిపల్లిలో అంబేద్కర్ జయంతి
భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ 132 వ జయంతి సందర్బంగా సంగారెడ్డి పోతిరెడ్డిపల్లిలో గల శిల్పా వెంచర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి నాయకులు పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఫోరమ్ అధ్యక్షుడు శ్రీధర్ మహేంద్ర మాట్లాడుతూ అంబేద్కర్ భారత రాజ్యాంగం ద్వారా అట్టడుగు వర్గాల సామజిక న్యాయం, హక్కుల కోసం చట్టబద్దంగా హక్కులు కల్పించి ప్రజల్లో ఆశాజ్యోతి గా నిలిచారని కొనియాడారు. ఆయన ఆశయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. కార్యక్రమం లో ఫోరమ్ ఉపాధ్యక్షులు సజ్జద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి అమిదిపురం మహేష్ కుమార్, సహా కార్యదర్శి శ్రీకాంత్, పాండు రంగం, కార్య వర్గ సభ్యులు సాయి వరాల, ప్రభు లింగం, రాము, స్థానిక నాయకులు గడ్డం మల్లేశం, అశోక్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్