తారా ప్రభుత్వ కళాశాల సంగారెడ్డిలో ఐసిసి ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్, ఎన్ఎస్ఎస్ యూనిట్స్ వన్, టూ, త్రీ, ఫోర్, మరియు ఎన్సిసిల ఆధ్వర్యంలో ప్రజ్వల ఫౌండేషన్ పూర్తి సహకారంతో మానవ అక్రమ రవాణా పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్ ప్రవీణ తెలిపారు. మానవ హక్కులకు భంగం కలిగించే అమానుష చర్యలలో మానవ అక్రమ రవాణా ఒకటని, అరికట్టడంలో యువత పాత్ర చాలా ఉందని తెలిపారు. కళాశాలలో బాలికలు మరియు బాలురకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి మానవ అక్రమ రవాణాకు కారణాలు, అక్రమ రవాణా జరిగే విధానాలను ప్రజ్వల పౌండేషన్ డాక్యుమెంటరీల ద్వారా విద్యార్థిని విద్యార్థులకు వివరించడం జరిగిందని, మానవ అక్రమ రవాణాపై జాగ్రత్త వహించడంమే కాక దానిని నివారించడంలో మన వంతు పాత్ర నిర్వహించలని తెలిపారు.
ప్రజ్వల ఫౌండేషన్ కు చెందిన బాలరామకృష్ణ మాట్లాడుతూ 3 సంవత్సరాల నుండి 45 స్త్రీలు అక్రమ రవాణాకు గురవుతున్నారనీ, బాలురను కూడా అక్రమ రవాణా చేస్తూ వీరిని వ్యభిచార గృహాలకు, అవయవాల వినియోగానికి, వెట్టిచాకిరి, లైంగిక కార్యకలాపాలకు, బిక్షటన వంటి వాటిని వినియోగించడం చాలా ఆందోళనకరమైన విషయం అని ఇటువంటి పై అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. పేదరికం, నిరక్షరాస్యత , కరువు వంటివి అక్రమ రవాణాకు ఊతం ఇస్తున్నాయి అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటేశం, ఎన్ఎస్ఎస్ అధికారి డాక్టర్ జగదీశ్వర్, ఐసిసి కన్వీనర్ డాక్టర్ విజయ, ఉమెన్ ఎంపవర్మెంట్ కన్వీనర్ జోష్న, ఎన్సిసి అధికారి మనోజ్ కుమార్, అధ్యాపకులు విశ్వేశ్వర శర్మ, షరీఫ్ మియ, ప్రజ్వల ఫౌండేషన్ ప్రతినిధులు బాల రామకృష్ణ, సురేష్, రేష్మ, వాలంటరీలు మరియు విద్యార్థి విద్యార్థినులు పాల్గొన్నారు.