స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని ఎస్పీ రూపేష్ అన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి ఎస్పీ కార్యాలయంలో గురువారం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు దేశభక్తిని కలిగి ఉండాలని చెప్పారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ సంజీవరావు, పోలీసులు పాల్గొన్నారు.