సంగారెడ్డి మండలం ఫసల్వాది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గ తేడాది పదవ తరగతిలో మంచి ఫలితాలు సాధించిన ఆరుగురు విద్యార్థులకు పట్నం మాణిక్యం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగదు బహుమతులను గురువారం అందజేశారు. మాజీ సర్పంచ్ నిర్మలాదేవి చేతుల మీదుగా నగదును అందించారు. బాగా చదివి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ రవితేజ పాల్గొన్నారు.