తారా ప్రభుత్వ కళాశాలలో (A) సంగారెడ్డి ఎన్ఎస్ఎస్ యూనిట్ వన్ టూ త్రీ ఫోర్ ల ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా సోమవారం క్లీన్ ఇండియా అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్ ప్రవీణ తెలిపారు.కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని యువజన వ్యవహారాలు క్రీడల శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా దేశంలోని అన్ని ప్రాంతాలలో క్లీన్ ఇండియా కార్యక్రమాన్ని నిర్వహించటం జరుగుతుందని అందులో భాగంగా కళాశాలలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించి కళాశాలలో చెత్త చెదారమును తొలగించడంమే గాక ప్లాస్టిక్ ను తొలగించడం జరిగిందని తెలిపారు.
పరిసరాల పరిశుభ్రత మన అందరి బాధ్యత అని పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఆరోగ్యవంతమైన జీవనం సాధ్యమవుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ చెత్తాచెదారాన్ని నిర్దేశించిన ప్రాంతంలోనే వెయ్యాలని అప్పుడే స్వచ్ఛభారత్ నిర్మాణం సాధ్యం అవుతుందని తెలిపారు ఆజాది కా అమృత్ మహోత్సవంలో నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో క్లీన్ ఇండియా ఒకటని అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ అధికారులు కళాశాల అధ్యాపకులు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు అక్షయ, రుచిత, సాయి కుమార్, తేజ , తదితరులు పాల్గొన్నారు.