సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని పోతిరెడ్డిపల్లి సండే మార్కెట్ లో మ్యాన్ హోల్ ప్రమాదకరంగా మారింది. మ్యాన్ హోల్ పై మూత లేకపోవడంతో రాత్రి సమయంలో వాహనదారులు ప్రమాదానికి గురవుతున్నారని స్థానికులు తెలిపారు. మున్సిపల్ అధికారులకు విన్నవించినా పట్టించుకోవడంలేదని ఆరోపించారు. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరారు.