సంగారెడ్డి: మున్సిపల్ కార్మికులకు 26వేల వేతనం ఇవ్వాలని డిమాండ్

77చూసినవారు
సంగారెడ్డి: మున్సిపల్ కార్మికులకు 26వేల వేతనం ఇవ్వాలని డిమాండ్
మున్సిపాలిటీలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులకు నెలకు 26 వేల రూపాయల వేతనం ఇవ్వాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి యాదగిరి డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని సుందరయ్య భవన్లో జిల్లా కార్యవర్గ సమావేశం గురువారం నిర్వహించారు. కార్మికుల వేతనాలు పెంచాలని కోరుతూ ఈనెల 25వ తేదీన హైదరాబాద్ లోని సీడీఎంఏ కార్యాలయాన్ని మొట్టడిస్తున్నట్లు చెప్పారు. కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

సంబంధిత పోస్ట్