సంగారెడ్డి పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని సబ్ ఇన్స్పెక్టర్ మొహమ్మద్ సర్దర్ అన్నారు. సంగారెడ్డి పట్టణ ఎస్సైగా మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ ఎవరికైనా సమస్యలు ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు.