స్వాతంత్ర సమరయోధుడు విప్లవవీరుడు, షహీద్ భగత్ సింగ్ జయంతి సందర్బంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో గల భగత్ సింగ్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన ఫోరమ్ అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. చిన్నా వయసులోనే దేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ పాలకులపై విరోచిత పోరాటం చేసిన భగత్ సింగ్ జీవిత చరిత్రను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.