జంతువులను హింసించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రశేఖర్ అన్నారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో పశుసంవర్ధక శాఖ అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జంతువుల పట్ల ప్రేమ చూపించాలని పేర్కొన్నారు. చిన్నారులు, వృద్ధులు బయటకు వెళ్ళినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.