మండల కేంద్రమైన కందిలోని మైనార్టీ పాఠశాలలో డైట్ పండగ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. గురుకుల పాఠశాలలో ఉన్న సౌకర్యాల గురించి విద్యార్థులు పాటల రూపంలో వివరించారు. విద్యార్థుల తల్లిదండ్రులను ఆహ్వానించి విద్యార్థులకు బోధిస్తున్న సౌకర్యాలు గురించి ఉపాధ్యాయులు అవగాహన కల్పించారు.