తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల సంగారెడ్డిలో ఎన్ఎస్ఎస్ యూనిట్స్ వన్ టూ త్రీ ఫోర్ ల ఆధ్వర్యంలో గురువారం జాతీయ విద్యా దినోత్సవం నిర్వహించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపల్ ప్రవీణ తెలిపారు. స్వతంత్ర భారతదేశ మొదటి విద్యా శాఖ మంత్రి గా విద్య, వైజ్ఞానిక, కళల వికాసానికి నిరంతరం కృషి చేసిన వ్యక్తి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ అని, విద్యా రంగంలో చేసిన సేవలకు ప్రభుత్వం భారతరత్న బిరుదుతో సన్మానించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రవీణ, ఎన్ఎస్ఎస్ అధికారులు, డాక్టర్ జగదీశ్వర్ డాక్టర్ పద్మజా, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటేశం, డాక్టర్ ఉపేందర్, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.