రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్లో బిసి సంక్షేమం కోసం కేవలం 6229 కోట్లు కేటాయింపులు చేయటం బిసి కులాలకు ఈ బడ్జెట్లో న్యాయం జరుగలేదని, జనాభాలో 50 శాతం పైగా ఉన్న బిసి జనాభాకు అరకొర కేటాయింపులు చేస్తే సంక్షేమం ఎలా సాధ్యమవుతుందని ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర సోమవారం ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి అమలు ప్రస్తావన ఈ బడ్జెట్లో లేక పోవటం ప్రభుత్వం మరో సారి నిరుద్యోగులకు నిరాశకు గురి చెసిందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బిసి సంక్షేమం కోసం, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేసి ఉపాధి కోసం కృషి చేయాలని డిమాండ్ చేశారు.