సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి సండే మార్కెట్ లోని అభయాంజనేయ స్వామి దేవాలయ వార్షికోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. ఉదయం హనుమంతునికి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను జరిపించారు. మహిళలు లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో జరిపించారు. పిల్లలు పూజించిన పుష్పాలను హనుమంతునికి సమర్పించారు. అనంతరం ఆలయ ఆవరణలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.