హైదరాబాద్లోని కోకాపేటలో ఈనెల 14వ తేదీన దొడ్డి కొమరయ్య ఆత్మగౌరవ భవన ప్రారంభోత్సవానికి జిల్లా నుంచి కురుమలు అధిక సంఖ్యలో తరలి రావాలని జిల్లా అధ్యక్షుడు నగేష్ కోరారు. సంగారెడ్డిలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భవన ప్రారంభోత్సవానికి తెలంగాణ కర్ణాటక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సిద్ధరామయ్య, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరవుతారని చెప్పారు.