ప్రతి మూడు నెలలకు ఓసారి ఈవీఎం స్ట్రాంగ్ రూములను ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పరిశీలిస్తున్నట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి మంగళవారం తెలిపారు. పాత డీఆర్డిఏ కార్యాలయ ఆవరణలో ఉన్న ఈవీఎంలను పరిశీలించినట్లు చెప్పారు. సీసీ కెమెరాల పనితీరు, విద్యుత్ సౌకర్యం తదితర వాటిపై ఆరా తీసినట్లు పేర్కొన్నారు.