తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా జరగుతున్న కుల గణనకు రాష్ట్ర పరిశ్రమల మౌళిక సదుపాయాల కల్పన చైర్ పర్సన్ తూర్పు నిర్మలా జగ్గారెడ్డి శుక్రవారం సిబ్బందికి వివరాలను తెలిపారు. సంగారెడ్డి పట్టణంలోని వారి నివాసంలో కుల గణనకు వచ్చిన ఎన్యుమరేటర్లకు తమ కుటుంబ వివరాలను నిర్మలా జగ్గారెడ్డి తెలియజేశారు.