అయ్యప్ప స్వామి వారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకొని సంగారెడ్డిలోని చెరువు కట్ట వద్ద గల శ్రీ నవరత్నాలయ దేవస్థానంలో శ్రీ సాహితీ రాము గురుస్వామి ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ఉత్తర నక్షత్ర అయ్యప్ప స్వామి మహా పడిపూజ కన్నుల పండుగగా జరిగింది.ఈ పూజలో అయ్యప్ప దీక్ష దారులు, శివ దీక్ష దారులు అధిక సంఖ్యలో పాల్గొని శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగిపోయింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.