తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల సంగారెడ్డి లో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు జిల్లా స్థాయి క్విజ్ పోటీలలో ప్రధమ, తృతీయ బహుమతులను సాధించారని కళాశాల ప్రిన్సిపాల్ ఎం ప్రవీణ్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ డిగ్రీ కళాశాల విద్యార్థులకు జిల్లా ఎయిడ్స్ ప్రీవెన్సన్ మరియు నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్విజ్ పోటీలను నిర్వహించడం జరిగిందని, ఈ పోటీలలో తమ కళాశాలకు చెందిన ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు జర్న ముస్కాన్, సయోద సనా కౌసర్ లు మొదటి బహుమతిని పొంది ఐదు వేల రూపాయల నగదును, ఆయోషాసనా మూడవ బహుమతి పొంది రెండు వేల రూపాయల నగదును జిల్లా స్థాయి పోటీలలో గెలుచుకున్నారు అని తెలిపారు. జిల్లా స్థాయిలో జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగం నిర్వహించిన ఈ క్విజ్ పోటీలలో తమ కళాశాల నుండి ప్రథమ బహుమతి పొందిన విద్యార్థులు సంగారెడ్డి జిల్లా తరఫున రాష్ట్ర స్థాయి క్విజ్ పోటీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని తెలిపారు. జిల్లా స్థాయి క్విజ్ పోటీ విజేతలైన తమ వాలంటీర్లు డిఎంహెచ్ఓ డాక్టర్ గాయత్రి దేవి, ఏడిఐ డాక్టర్ మహేందర్ రెడ్డి, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి డేనియల్ నుండి బహుమతులను స్వీకరించడం జరిగిందని తెలిపారు.