పోలీస్ యూనిఫామ్ లో వీడియో కాల్ చేస్తే స్పందించవద్దని విచారణ పేరుతో బెదిరిస్తే తికమక పడోద్దని సిర్గాపూర్ ఎస్ఐ వెంకట్ రెడ్డి ఆన్నారు. మంగళవారం ఆయన స్థానిక పోలీస్ స్టేషన్ లో మాట్లాడుతూ.. పోలీసులు ఎప్పుడు కూడా వీడియో కాల్స్ ద్వారా విచారణ చేయారని అన్నారు. లోన్స్ పేరుతో ఫోను చేస్తే కంగారుపడి వ్యక్తిగత సమాచారం అస్సలు ఇవ్వొద్దన్నారు. సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.