తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ విపి గౌతమ్, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు శుక్రవారం సంగారెడ్డి పట్టణంలో పర్యటించారు. చాకలి బస్తి, శివాజీ నగర్, మంజీరా నగర్ ప్రాంతాలలో పర్యటించి ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారుల వివరాలను పరిశీలించారు. దరఖాస్తుదారుల నివాస ప్రాంతాలను సందర్శించి, వారి అర్హతలను పరిశీలించేందుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.