జాహిరబాద్ లో 108 వంటకలతో గణేష్ మూర్తి కి నైవేద్యం

882చూసినవారు
జాహిరబాద్ లో 108 వంటకలతో గణేష్ మూర్తి కి నైవేద్యం
జహీరాబాద్ పట్టంలోని వసుందర నగర్ కాలనీ సాయి గణేష్ కమిటి గణేష్ నవరాత్రులు సందర్భంగా గణనాధునికి ప్రత్యేకంగా కాలనీ మహిళలు భక్తితో వివిధ రకాల 108 పిండి వంటకాలు తయారు చేసి శుక్రవారం గణ నాధునికి నైవేద్యంగా సమర్పించారు. ముఖ్యంగా మహిళలు కుంకుమార్చన అనంతరం గణేశునికి తమ ఇండ్లలో తయారు చేసిన వివిధ రకాల అయిన 108 పిండి తో తయారు చేసి స్వామికి నైవేద్యం అందించి, అనంతరం భక్తులకు ప్రసాదంగా అందించారు. మహిళలు వివిధ రకాల సాంకృతిక కార్యక్రమాలు , అన్నదాన కార్యక్రమం రాత్రి భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు వినీల నరేష్ (ఝారసంగం జెడ్పీటీసీ) రాజ్ కుమార్ ఏపీఓ, సురేష్ రావు, అంజయ్య న్యాయవాది , మల్కాపూర్ శ్రీనివాస్ , సునీల్ కుమార్, దత్తు, రజినీకాంత్, శివరాజ్, సుభాష్ మహిళలు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్