పోగొట్టుకున్న మొబైల్‌ ఫోన్ అందజేత

71చూసినవారు
పోగొట్టుకున్న మొబైల్‌ ఫోన్ అందజేత
మొగుడంపల్లి మండల కేంద్రానికి చెందిన సంధ్య ఫోన్‌ గత జూన్ నెలలోపోయింది. దీంతో చిరాగ్ పల్లి పోలీస్ స్టేషన్లో బాతురాలు సంధ్య ఫిర్యాదు చేసింది. సీఈఐఆర్‌ పోర్టల్‌ ద్వారా దర్యాప్తు చేపట్టిన పోలీసులు పోగొట్టుకున్న ఫోన్‌ను గుర్తించి సోమవారం స్థానిక చిరాగ్ పల్లి పోలీస్ స్టేషన్లో బాధితురాలికి అప్పగించారు. ఈ సందర్భంగా ఎస్ఐ కే.రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎవరైనా ఫోన్లు పోగొట్టుకున్న, దొంగిలించబడినా వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే రికవరీ చేసే అవకాశాలు ఉన్నాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చిరాగ్ పల్లీ పోలీస్ స్టేషన్ సిఈఐఆర్ ఆపరేటర్ సికిందర్ ఉన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్