జహీరాబాద్ ప్రాంత రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి విమర్శించారు. జహీరాబాద్ లోని శివాజీ విగ్రహం వద్ద బుధవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు ఇచ్చి 66 మోసాలు చేసిందని చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లందుకే సభలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.