మొలకెత్తిన బంగాళదుంపలు తింటున్నారా?

71చూసినవారు
మొలకెత్తిన బంగాళదుంపలు తింటున్నారా?
మామూలుగా మొలకెత్తిన శనగలు, బఠానీ, రాగులు, సజ్జలు ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ మొలకెత్తిన బంగాళదుంపలు తింటే మాత్రం ఆరోగ్యానికి హానికరమని వైద్యులు చెబుతున్నారు. మొలకెత్తిన బంగాళదుంపలు విషపూరితమై, ఒక్కోసారి ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీస్తాయని హెచ్చరిస్తున్నారు. మొలకల్లో గ్లైకోఅల్కలాయిడ్లు అనే విషపూరితమైన రసాయన పదార్థాలు ఉంటాయని, ఒక్కోసారి వాటిని అధిక మొత్తంలో తినడం వల్ల ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుందని చెబుతున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్