దక్షిణ కొరియాలో ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ కలిసి నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో బుధవారం అపశృతి చోటుచేసుకుంది. KF 16 ఫైటర్ జెట్ నుంచి అకస్మాత్తుగా నివాస ప్రాంతాలపై 8 బాంబులు పడ్డాయి. ఈ ప్రమాదంలో ఐదుగురితో పాటు మరో ఇద్దరు సైనికులకు తీవ్రగాయాలయ్యాయి. ఉత్తర కొరియా సరిహద్దులో ఉన్న పోషియాన్ సిటీలో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.