ఛాంపియన్స్ ట్రోఫీ.. ఫైనల్లో ఏమైనా జరగొచ్చు: కేన్

51చూసినవారు
ఛాంపియన్స్ ట్రోఫీ.. ఫైనల్లో ఏమైనా జరగొచ్చు: కేన్
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన సెమీస్‌లో న్యూజిలాండ్‌ ఘన విజయం సాధించింది. ఆదివారం(9న) జరగనున్న తుదిపోరులో న్యూజిలాండ్‌, భారత్‌తో తలపడనుంది. సెమీస్‌లో విజేతగా నిలిచాం, ఇక ఫైనల్‌లో ఏమైనా జరగొచ్చని కివీస్ మాజీ కెప్టెన్ కేన్‌ విలియమ్సన్‌ తెలిపారు. 'భారత్‌ అద్భుతమైన జట్టు. బాగా ఆడుతోంది. గత మ్యాచ్‌ నుంచి నేర్చుకొన్నాం. ఈ సారి విజయం కోసం తీవ్రంగా యత్నిస్తాం' అని కేన్ చెప్పుకొచ్చారు.

సంబంధిత పోస్ట్