రాష్ట్రంలో అక్రమ రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రభుత్వ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేసే అధికారాన్ని ఇకపై తహశీల్దార్లకు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ అధికారం కేవలం కలెక్టర్లకు మాత్రమే ఉండేది. తాజాగా ఆ అధికారం ఎమ్మార్వోలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. త్వరలోనే దీనిపై అధికారక ప్రకటన రానున్నట్లు పేర్కొన్నారు.