ఏపీలో వైసీపీ నేతల అరెస్టులతో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఈ జాబితాలో మాజీ మంత్రులు రోజా, విడుదల రజినీ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. చిలకలూరి పేటలో భూ ఆక్రమాలు, బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడ్డారని మాజీ మంత్రి విడదల రజినీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. చాలామంది వద్ద డబ్బులు తీసుకున్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇక మాజీ మంత్రి రోజా ‘ఆడుదాం ఆంధ్రా’ పేరుతో రూ.కోట్ల దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ మేరకు కూటమి వీరిపై చర్యలకు సిద్దపడుతోంది.