AP: విశాఖలో జరిగిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ‘ప్రపంచ చరిత్ర' పుస్తకావిష్కరణలో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'రాజకీయాల నుంచి రిటైర్ అయ్యాక వెంకటేశ్వరరావు ఏం చేస్తున్నారని అడిగా. ఎందుకంటే రేపు నాకు అదే పరిస్థితి వస్తే ఏం చేయాలో ఆలోచిస్తున్నా. మోస్ట్ రీలాక్స్ పర్సన్ వెంకటేశ్వర్లు. నిద్రలేస్తే బాడ్మింటన్ ఆడుతారు. ఫ్రెండ్స్ తో పేకాట ఆడతారు. సాయంత్రం హ్యాపీగా నిద్రపోతారు' అని అన్నారు.