తిరుమల కల్తీ నెయ్యి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2019లోనే టీటీడీకి భోలేబాబా డెయిరీ నెయ్యి సరఫరా చేసినట్టు గుర్తించారు. 2022లో ఈ సంస్థ ట్యాంకర్లను తిరస్కరించగా, ఆ తరువాత వైష్ణవి డెయిరీ పేరుతో మళ్లీ సరఫరా కొనసాగించినట్టు విచారణలో తేలింది. తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ సంస్థ నెయ్యి సరఫరాకు ఒప్పందాన్ని పొందినప్పటికీ, భోలేబాబా ఆర్గానిక్ డెయిరీ, వైష్ణవి డెయిరీ ద్వారా కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు నిర్ధారించారు.