తమిళనాడులోని తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయం వెనుక దాదాపు 100 అడుగుల ఎత్తు నుంచి కొండరాళ్లు పడిపోయాయి. అక్కడ ఇళ్లపై పడిన శిథిలాల్లో 5 మంది చిన్నారులు సహా ఏడుగురు చిక్కుకున్నట్లు సమాచారం. గత రాత్రి ఈ ఘటన జరగ్గా, సమాచారం అందుకున్న రెస్క్యూ టీం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. ఇప్పటికీ వారంతా శిథిలాల కిందే ఉన్నారు. వారి కోసం గంటల తరబడి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.