ఇవాళ మధ్యాహ్నం జరగనున్న SRH vs RR మ్యాచ్ టికెట్లను బ్లాక్‌లో విక్రయిస్తున్న 11 మందిని పోలీసులు వేర్వేరు చోట్ల అరెస్ట్ చేశారు. మహేశ్వరంలో నలుగురు, మల్కాజిగిరిలో ముగ్గురు, ఎల్‌బి నగర్‌లో ముగ్గురు, భువనగిరిలో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. వారిని నుంచి టికెట్లు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు.