బీచ్‌లో ఈత కొడుతున్న వారిపై సొర చేప దాడి (షాకింగ్ వీడియో)

79చూసినవారు
అమెరికాలోని టెక్సాస్ లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. అక్కడ ఓ సముద్రంలో సేదతీర్చుకోవడం కోసం చాలా మంది టూరిస్టులు వెళ్తుంటారు. ఈ క్రమంలో టూరిస్టులు ఈతకొడుతూ సేద తీర్చుకుంటుండగా ఓ సొర చేప ముగ్గురిపై తీవ్రంగా దాడి చేసింది. ఈ సొర చేప దాడిలో ఓ మహిళ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా పరుగులు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్