తెలంగాణలో మద్యం ప్రియులకు షాక్‌

76చూసినవారు
తెలంగాణలో మద్యం ప్రియులకు షాక్‌
తెలంగాణలో బీర్ల నిల్వలు తగ్గిపోతున్నాయి. ప్రస్తుతం గోడౌన్‌లో లక్ష కేసులు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు సమాచారం. ఈ నెల 8 వరకు సుమారు 84 లక్షల కేసులు ఉండగా క్రమేపి బీర్ల స్టాక్‌ తగ్గుతోంది. మరో రెండు, మూడు రోజులు మేనేజ్‌ చేయొచ్చని డిస్ట్రిబ్యూటర్లు అంటున్నారు. పాత బకాయిలు ఇవ్వకపోవడంతో బీర్ల స్టాక్‌ను యునైటెడ్‌ బ్రూవరీస్‌ (యూబీ) సంస్థ నిలిపివేసిన సంగతి తెలిసిందే. కాగా రాష్ట్రంలో కొత్త బీర్ బ్రాండ్లు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.

సంబంధిత పోస్ట్