క్రికెట్ అభిమానులకు షాక్!.. చెన్నైలో భారీ వ‌ర్షం

67చూసినవారు
క్రికెట్ అభిమానులకు షాక్!.. చెన్నైలో భారీ వ‌ర్షం
ఐపీఎల్ ప‌దిహేడో సీజ‌న్ ఫైన‌ల్ పోరుకోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న అభిమానుల‌కు భారీ షాక్ తగిలింది. చెన్నైలో భారీ వ‌ర్షం ప‌డింది. శ‌నివారం సాయంత్రం ఒక్కసారిగా వాతావ‌ర‌ణం మారిపోయింది. ఉరుములతో, మెరుపులతో చినుకులు మొద‌ల‌య్యాయి. ఊహించ‌ని వ‌ర్షం రాక‌తో అప్ర‌మ‌త్త‌మైన చెపాక్ స్టేడియం సిబ్బంది ప్లాస్టిక్ క‌వ‌ర్ల‌తో పిచ్ మొత్తాన్ని క‌ప్పి వేశారు. ఆదివారం ఫైన‌ల్ మ్యాచ్‌కు వాన ముప్పు తప్ప‌క‌పోవ‌చ్చు అని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది.

సంబంధిత పోస్ట్