విషాదం.. ఓటు వేసేందుకు వెళ్తున్న వ్యక్తిని తొక్కి చంపిన ఏనుగు

53చూసినవారు
విషాదం.. ఓటు వేసేందుకు వెళ్తున్న వ్యక్తిని తొక్కి చంపిన ఏనుగు
ఓటు వేసేందుకు వెళ్తున్న ఒక వ్యక్తిపై ఏనుగు దాడి చేసి..తొక్కి చంపింది. జార్ఖండ్‌లోని తూర్పు సింగ్‌భూమ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. గోబర్బాని గ్రామానికి చెందిన 71 ఏళ్ల వృద్ధుడు ఓటు వేసేందుకు శనివారం ఉదయం ఇంటి నుంచి బయలు దేరాడు. అటవీ మార్గంలో నడుచుకుంటూ ధోలబెడ పోలింగ్ కేంద్రానికి వెళ్తుండగా ఓ ఏనుగు అతడిపై దాడి చేసింది. కాళ్లతో తొక్కి ఆ వృద్ధుడ్ని చంపింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్