భార్యతో సన్నిహిత్యంగా ఉన్న వీడియోలను ఇతరులకు షేర్ చేసే హక్కు భర్తకు కూడా లేదని అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. ఇది భార్యాభర్తల మధ్య బంధాన్ని ఉల్లంఘించడమే అవుతుందని తెలిపింది. ఈ నేపథ్యంలో భార్యకు భర్త యజమాని కాదని, ఆమెకంటూ కొన్ని హక్కులు ఉంటాయిని పేర్కొంది. అయితే ఓ మహిళ తన వీడియోలను భర్త ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడని కేసు నమోదుచేయగా.. హైకోర్టు ఈ తీర్పును వెలువరించింది.