కబడ్డీ ప్లేయర్ దీపక్ హుడాపై ఆయన భార్య స్వీటీ బూరా సంచలన ఆరోపణలు చేశారు. హుడాకు అబ్బాయిలంటే మోజు అని చెప్పారు. తాను విడాకులు ఇవ్వమని అడుగుతున్నానని, ఎలాంటి ఆస్తిని అడగట్లేదని పేర్కొన్నారు. దీపక్ తనను దారుణంగా వేధించడమే కాకుండా చెడుగా చిత్రీకరిస్తున్నాడని పేర్కొన్నారు. కాగా దీపక్ తనను వేధిస్తున్నాడని స్వీటీ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అలాగే దీపక్ హుడాను స్వీటీ కొట్టిన వీడియో వైరల్ అవుతోంది.