వాహనాలు నడుపుతున్నప్పుడు ఎంత అప్రమత్తంగా ఉన్నా కొన్నిసార్లు ఊహించని ప్రమాదాలు మృత్యువులా వెంటాడుతాయి. కేరళకు చెందిన ఓ వ్యక్తి ఇలాగే ఊహించని ప్రమాదంలో మరణించాడు. రోడ్డుపై గస్తీ కాస్తున్న ముగ్గురు పోలీసులు అటుగా ఎవరూ వెళ్లకుండా రోడ్డుకు అడ్డంగా ఓ తాడు కట్టారు. అదే సమయంలో వేగంగా బైక్‌పై వస్తున్న ఓ వ్యక్తి ఆ తాడుకు తగిలి కిందపడిపోయాడు. తాడు మెడను కోసేయడంతో అతడు మృత్యువాత పడ్డాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.