అక్బరుపేట భూంపల్లి మండలంలోని వీరారెడ్డిపల్లి గ్రామంలో సోమవారం ఎన్ఆర్ఆజీఎస్ నిధుల ద్వారా మంజూరైన 20 లక్షల రూపాయలతో నూతనంగా వేయనున్న సీసీ రోడ్ల నిర్మాణం కొరకు దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి బండ మల్లన్న ఆలయం వద్ద భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.