ప్రజలు ట్రాఫిక్ నియమాలను తప్పకుండా పాటించాలని భూంపల్లి ఎస్ఐ హరీశ్ గౌడ్ సూచించారు. అక్బర్ పేట భూంపల్లి చౌరస్తాలో జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలను పురస్కరించుకొని యువకులు, వాహనదారులకు అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు త్రిబుల్ రైడింగ్ చేయవద్దని, మైనర్ డ్రైవింగ్ ప్రమాదకరమని సూచించారు. మద్యం తాగి వాహనాలు నడపవద్దని తెలిపారు. ఖచ్చితమైన డాక్యుమెంట్లు లేకుండా వాహనాలు నడపరాదని పేర్కొన్నారు.