కాంగ్రెస్ వచ్చింది ..కేసీఆర్ కిట్ బంద్ అయింది: హరీశ్ రావు

77చూసినవారు
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతోనే కేసీఅర్ కిట్ బంద్ అయిందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో బీఅర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు. తోటపల్లి, అనంతగిరి కట్టి పొలాలకు నీళ్లిచ్చామన్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దును బెజ్జంకి మండల ప్రజలు కోరుతున్నారని తాను అండగా ఉంటానని, అవసరమైతే కోర్టుకు పోయి కొట్లాడుతానని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్