దుబ్బాక: లబ్ధిదారులకు చెక్కులను అందజేసిన మంత్రి, ఎమ్మెల్యే

70చూసినవారు
సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం పరిధిలోని నార్సింగ్, చేగుంట మండలాలకు చెందిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో శనివారం జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి కొండా సురేఖ, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పేద ప్రజలకు ఎంతో మేలు చేసిందన్నారు.

సంబంధిత పోస్ట్