సాంకేతిక విద్యతో ఉద్యోగ అవకాశాలు!

58చూసినవారు
సాంకేతిక విద్యతో ఉద్యోగాలు ఎక్కువగా లభిస్తాయని చేగుంట పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ చక్రవర్తి అన్నారు. శనివారం పాలిటెక్నిక్ వార్షికోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పాలిటెక్నిక్ లో ఎంతో మంది విద్య నభ్యసించి ఉన్నత స్థితిలో ఉంటున్నారని అన్నారు. చేగుంట పాలిటెక్నిక్ అన్ని రంగాల్లో ముందుకు సాగుతుందని తెలిపారు. రానున్న రోజుల్లో మరికొన్ని కోర్సులు వస్తాయన్నారు.

సంబంధిత పోస్ట్